Wednesday, August 26, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎస్‌ఐఆర్‌ రెండో విడతపై కాంగ్రెస్‌ దృష్టి

ఎస్‌ఐఆర్‌ రెండో విడతపై కాంగ్రెస్‌ దృష్టి

📰 Generate e-Paper Clip

ప్రతి ఓటరు.. ప్రతి ఓటు కీలకం: కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వొడితల ప్రణవ్‌

హుజురాబాద్, ఆగస్టు 24 (చైతన్యగళం):

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఓటరు, ప్రతి ఓటు ముఖ్యమని, ఎస్‌ఐఆర్‌ రెండో విడత ప్రక్రియను కూడా మొదటి విడత మాదిరిగానే విజయవంతం చేయాలని కరీంనగర్ మాజీ సుడా చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ పిలుపునిచ్చారు హుజురాబాద్ పట్టణంలో సోమవారం బూత్‌ స్థాయి ఏజెంట్లకు ఎస్‌ఐఆర్‌ రెండో విడతపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతలో బూత్‌ స్థాయి ఏజెంట్లు చూపిన నిబద్ధతను రెండో విడతలోనూ కొనసాగించాలని సూచించారు. ఓటరు నమోదు, సవరణల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని, పేర్ల మార్పునకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రతి ఓటరును మ్యాపింగ్‌ చేయడం ద్వారా భవిష్యత్‌లో వారి ఓటు హక్కును కాపాడినవారమవుతామని అన్నారు. నియోజకవర్గంలోని బూత్‌ స్థాయి ఏజెంట్లు, సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేస్తున్న తీరును అభినందించారు పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారికి మాత్రమే నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని వొడితల ప్రణవ్‌ తెలిపారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలోని అన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుహాసిని, కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, పార్టీ కార్యదర్శులు, ఎస్‌ఐఆర్‌ సమన్వయకర్తలు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు, దేవాలయాల చైర్మన్లు, మండలాల అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!