హుజురాబాద్, ఆగస్టు 24 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ నూతన కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశేష ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రతి కుటుంబంతో కార్యకర్తలు అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు నూతన కార్యవర్గ సభ్యులు సమష్టిగా పనిచేస్తూ హుజురాబాద్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల నమ్మకాన్ని పొందాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తే హుజురాబాద్‌లో బీజేపీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు సమావేశంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కొలిపాక శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు పంజాల మనోజ్, తూర్పాటి లక్ష్మీదుర్గ, కొలుగూరి సుమలత, పట్టణ ప్రధాన కార్యదర్శులు తిప్పబత్తిని రాజు, గంట సంపత్, ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి, వొడ్నాల విజయ్, ఇల్లందుల ప్రణీత్, ఇదులకంటి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులు బోడిగే రాధ, కొలుగూరి అనిల్, వివిధ మోర్చాల అధ్యక్షులు, నూతన కార్యవర్గ సభ్యులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
