- రాజ్యాంగ పీఠిక చదివి పరిరక్షణకు ప్రతిజ్ఞ
ఎల్కతుర్తి, నవంబర్ 26 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామపంచాయతీలో గురువారం జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ సూచించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల బాబు, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.

