Sunday, November 15, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎల్కతుర్తిలో ఆహార నాణ్యతపై ఆందోళన.. తనిఖీలు చేయాలని డిమాండ్

ఎల్కతుర్తిలో ఆహార నాణ్యతపై ఆందోళన.. తనిఖీలు చేయాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

  • హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో పరిశుభ్రతపై ఫిర్యాదులు.. అధికారులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి

ఎల్కతుర్తి, నవంబర్ 14 (చైతన్యగళం):

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించకపోవడంతో కొన్ని హోటళ్ల నిర్వాహకులు నిబంధనలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ప్రధాన రహదారులు, బస్టాండ్‌ పరిసరాల్లోని కొన్ని హోటళ్లలో కనీస పరిశుభ్రత కూడా పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఒకే వంటనూనెను రోజుల తరబడి మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారని, నూనె నల్లగా మారినా మార్చడం లేదని ఆరోపిస్తున్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసం, కూరగాయల నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వంటగదులు, ఆహార పదార్థాల నిల్వ ప్రాంతాల్లో శుభ్రత పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు.

అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన ఆహారం తినడం వల్ల చిన్నపిల్లలు, విద్యార్థులు సహా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ విక్రయించే చిరుతిళ్ల వద్ద ఈగలు వాలుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా ఆహార భద్రతాధికారులు ఎల్కతుర్తిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించాలని స్థానిక ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, దాబాలు, బేకరీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లైసెన్సులను రద్దు చేయాలని కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!