నల్లగొండ, నవంబర్ 10 (చైతన్యగళం):
నల్లగొండ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. అయితే ఆమె భర్త సతీష్ గొంతునులిమి హత్య చేసినట్లు సమాచారం. కులాంతర వివాహం చేసుకున్న వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఆమె భర్త సతీష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, ఎస్సైలు పరిశీలించారు.
