- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడమే లక్ష్యం
ఎల్కతుర్తి, నవంబర్ 11 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన గ్రామం – మన పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతిరోజూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు.
గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల బాబు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పొతారబోయిన లింగమూర్తి, మాజీ సర్పంచ్ సబ్బు కొమరయ్య, వార్డు సభ్యులు పసుల శ్రీనివాస్, బందెల మంజుల, సునీత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
