- విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రతకు అల్పాహార పథకం దోహదం
ఎల్కతుర్తి, నవంబర్ 11 (చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఎల్కతుర్తి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ కూలీ పనులకు వెళ్లే పేద కుటుంబాల పిల్లలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం ఆకలితో తరగతి గదుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి లేకుండా, ఆరోగ్యంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి సారించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గొల్ల రాజేశ్వరరావు, డాక్టర్ రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, ఆర్‌ఐ సాధానందం, ఎంపీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
