కరువు పరిస్థితులపై ప్రభుత్వంతో చర్చించాలి

ఉత్తరాలు రాయడంతో సరిపెట్టకుండా హుస్నాబాద్‌ రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి: అయిలేని మల్లికార్జునరెడ్డి హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రివర్యులు కేవలం ఉత్తరాలు రాయడంతో సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై మంత్రికి పూర్తి అవగాహన ఉందని, ప్రత్యేక దృష్టి సారించి హుస్నాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు....