Saturday, October 31, 2026
Homeతెలంగాణకరీంనగర్గౌరవెల్లి కాంగ్రెస్‌ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా గొల్లపెల్లి సదానందం

గౌరవెల్లి కాంగ్రెస్‌ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా గొల్లపెల్లి సదానందం

📰 Generate e-Paper Clip

అక్కన్నపేట, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ శాఖ ఉపాధ్యక్షుడిగా గొల్లపెల్లి సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు అక్కన్నపేట మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్‌ గౌడ్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్‌ గౌడ్‌కు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన గౌరవెల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బైరగొని శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

రాబోయే రోజుల్లో గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సదానందం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీకి ప్రజలను మరింత చేరువ చేసేలా అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!