Tuesday, November 17, 2026
Homeతెలంగాణజాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులకు ఘన సన్మానం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

  • మహబూబాబాద్‌లో సోమ పురుషోత్తం, శ్రీరామ్‌ ప్రసాద్‌లకు సత్కారం

మహబూబాబాద్‌, నవంబర్‌ 16 (నీలగిరి ఎక్స్‌ప్రెస్‌):

జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్‌ పాత్రికేయులను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దూరదర్శన్‌ (డీడీ న్యూస్‌) జిల్లా స్టాఫర్‌ సోమ పురుషోత్తం, అరుణప్రభ న్యూస్‌ రిపోర్టర్‌ శ్రీరామ్‌ ప్రసాద్‌లకు ట్రస్ట్‌ ప్రతినిధులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్‌ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయులు కీలక బాధ్యత నిర్వహిస్తున్నారని కొనియాడారు. నిష్పక్షపాతంగా, నిజాయితీతో వార్తలను అందిస్తూ సమాజ అభివృద్ధికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులను సత్కరించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు సమాజానికి సేవలందిస్తున్న వివిధ రంగాల ప్రముఖులను గౌరవిస్తామని ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్‌ అధ్యక్షుడు గర్రెపల్లి నవీన్‌ కుమార్‌, కార్యదర్శి కొత్తూరు లీలావతి, ఉపాధ్యక్షురాలు దగ్గుల సుజాత, ఉప కార్యదర్శి పాక పద్మావతి, కార్యక్రమ కన్వీనర్‌ ఆకుల ప్రభు కుమార్‌, కొత్తూరు శ్రీనివాస్‌, బోనగిరి లక్ష్మీనారాయణ, నాగలింగం, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!