ఖానాపూర్, అక్టోబర్ 26 (చైతన్యగళం): ఖానాపూర్ మండలం సింగపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లిని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి భక్తుల కోర్కెలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
