- ఉదయం ఎల్లమ్మ ఆలయంలో చండీయాగానికి హాజరు.. అనంతరం ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
హుస్నాబాద్, అక్టోబర్ 25 (చైతన్యగళం): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
పర్యటనలో భాగంగా ఉదయం 8 గంటలకు హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించనున్న చండీయాగంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి క్యాంపు కార్యాలయం వెల్లడించింది.
