మానకొండూర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంలో డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన చెంజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తమ్మిశెట్టి రాజేశ్‌కు గ్రామంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు బుర్ర చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజేశ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. తనకు లభించిన బాధ్యతలతో రైతులకు అండగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లెన కొమురయ్య, బోళ్లబత్తుల ఆంజనేయులు, గాలి మొగిలి, జిల్లెల శ్రీనివాస్, కానిగంటి రమేశ్, బుర్ర మహేశ్, ఎలుకపెల్లి శ్రీనివాస్, చామనపెల్లి రమేశ్, వాటు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

