- 100 మందికి పైగా వైద్య పరీక్షలు.. ఆరోగ్యంపై అవగాహన
రామడుగు, అక్టోబర్ 25 (చైతన్యగళం): శక్తి యూత్ ఆధ్వర్యంలో సన్‌రైజ్ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో డాక్టర్ కిరణ్, డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించారు. 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యువత ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని శక్తి యూత్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సన్‌రైజ్ ఆసుపత్రి హెల్త్ క్యాంప్ మేనేజర్ కొత్తూరు రాజేందర్, సమన్వయకర్త సతీష్, సాయికిరణ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. శక్తి యూత్ కమిటీ సభ్యులు మణి, హరి చరణ్, అజయ్, చరణ్, దిలీప్, శ్యామ్, అజయ్, సిద్ధు, సాయి, విజయ్, గణేష్, సంజు, అభినవ్‌తో పాటు గ్రామస్థులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
