శక్తి యూత్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

100 మందికి పైగా వైద్య పరీక్షలు.. ఆరోగ్యంపై అవగాహన రామడుగు, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): శక్తి యూత్‌ ఆధ్వర్యంలో సన్‌రైజ్‌ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో డాక్టర్‌ కిరణ్‌, డాక్టర్‌ సురేష్‌ ఆధ్వర్యంలో వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించారు. 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని...