నూతన డీఈఓకు టీజీటిటీఎఫ్ ప్రతినిధుల ఘన స్వాగతం
సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జె. విజయ్సాగర్ను తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సమాఖ్య (టీజీటిటీఎఫ్) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ భేటీలో జిల్లాలో గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని టీజీటిటీఎఫ్...