Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న తహసీల్దార్ విజయ్‌కుమార్

దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న తహసీల్దార్ విజయ్‌కుమార్

📰 Generate e-Paper Clip

మానకొండూర్, అక్టోబర్ 17 (చైతన్యగళం):

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మానకొండూర్ తహసీల్దార్ విజయ్‌కుమార్ శనివారం చెంజర్ల గ్రామంలోని ఐదో వార్డులో కొలువుదీరిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం తహసీల్దార్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలకు దేవీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఐదో వార్డు సభ్యుడు దుడ్డెల శంకర్, నవరాత్రి ఉత్సవ మండపం నిర్వాహకులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!