- కేసీఆర్, గంగుల కమలాకర్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 16 (చైతన్యగళం):
సాగునీటి కోసం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ప్రయత్నాలతో రూరల్ మండలానికి నీరు చేరిందని నగునూరు, ఇరుకుల్ల గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు డీ-86 కాలువ వద్ద నీటిలోకి దిగి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రైతులు, స్థానిక నాయకులు మాట్లాడుతూ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడినా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిస్థితిని గుర్తించిన గంగుల కమలాకర్ స్వయంగా చొప్పదండికి వెళ్లి, నియంత్రణ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయించారని పేర్కొన్నారు. ఆయన చొరవతోనే రూరల్ మండలానికి సాగునీరు అందిందని తెలిపారు.
రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న గంగుల సేవలను మరువలేమని వారు అన్నారు. ప్రస్తుతం సాగునీరు అందడంతో పంటలను కాపాడుకునేందుకు అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచి సాగునీటి కోసం కృషి చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలిపారు.
