- మహిళల సౌకర్యార్థం మెట్లు.. భద్రత కోసం రైలింగ్, వీధి దీపాల ఏర్పాటు
సుల్తానాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం):
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలో బతుకమ్మ నిమజ్జన ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ ఆధ్వర్యంలో నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. మహిళలు సౌకర్యవంతంగా నిమజ్జనం చేసేందుకు ఘాట్ వద్ద మెట్లను ఏర్పాటు చేయడంతోపాటు, భద్రత కోసం రైలింగ్ నిర్మిస్తున్నారు. సాయంత్రం వేళల్లో నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా వీధి దీపాలను సైతం ఏర్పాటు చేయిస్తున్నారు.
శుక్రవారం ఘాట్ వద్ద జరుగుతున్న పనులను సర్పంచ్ దీకొండ భూమేష్ స్వయంగా పరిశీలించి, ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షించారు. బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే మహిళలు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్ దాసరి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
