బతుకమ్మ నిమజ్జనానికి ఘాట్ సిద్ధం
మహిళల సౌకర్యార్థం మెట్లు.. భద్రత కోసం రైలింగ్, వీధి దీపాల ఏర్పాటు సుల్తానాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలో బతుకమ్మ నిమజ్జన ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ ఆధ్వర్యంలో నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. మహిళలు సౌకర్యవంతంగా నిమజ్జనం చేసేందుకు ఘాట్ వద్ద మెట్లను ఏర్పాటు చేయడంతోపాటు, భద్రత కోసం రైలింగ్ నిర్మిస్తున్నారు. సాయంత్రం వేళల్లో నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఇబ్బందులు...