జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాలబద్రి శంకర్
పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కీలక బాధ్యతలు.. నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలబద్రి శంకర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం శుక్రవారం కరీంనగర్లోని తన శిబిర కార్యాలయంలో బాలబద్రి శంకర్కు నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి చేసిన సేవలను...