రెడ్‌క్రాస్‌ సొసైటీ విజేతలకు గంగుల అభినందనలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ విజేతలకు శాలువాలు కప్పి, పూల మొక్కలు అందించి సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ సంఘం లక్ష్మణరావు, వైస్‌ చైర్మన్‌ ఊట్కూరి...