సాయిబాబా మందిరం అధ్యక్షులు వందనం కమల్ కుమార్ జన్మదిన వేడుకలు

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని సాయిబాబా మందిరం అధ్యక్షులు వందనం కమల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ఆయన మిత్రులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కమల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. వందనం కమల్ కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సాయిబాబా మందిరం అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న సేవలు కొనసాగాలని,...