Saturday, October 10, 2026
Homeతెలంగాణకరీంనగర్రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు సాధన స్కూల్ విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు సాధన స్కూల్ విద్యార్థుల ఎంపిక

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 9 (చైతన్యగళం):

ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో టీజీఆర్ఎస్, జేసీ బాయ్స్ అల్లాపూర్‌లో నిర్వహించనున్న 45వ బాలుర జూనియర్ షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు కరీంనగర్ సాధన స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల చైర్మన్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాస్ రావు తెలిపారు.

గత నెల సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కే. అక్షయ్, ఎస్. వినయ్, టి.హెచ్. సాయి మనీష్, కే. రిషివర్ధన్, జె. అక్షిత్, ఎం. రిలేష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాస్ రావు, ప్రిన్సిపాల్ వి. కుమార్ స్వామి, హెచ్‌ఎం ఆర్. ధనలక్ష్మి, పీడీ జి. నరేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!