కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం)
ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్న చింతకుంట గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజీ బాలికలకు దారం సుశీల ట్రస్టు అండగా నిలిచింది.
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన టీ షర్టులు, షార్టులు అందించాలని పాఠశాల కబడ్డీ కోచ్ సంతోష్ ట్రస్టు నిర్వాహకులను కోరారు. స్పందించిన ట్రస్టు నిర్వాహకులు, ఎం.డి. ఫిజీషియన్ డాక్టర్ రఘురామన్ క్రీడాకారిణులకు అవసరమైన టీ షర్టులు, షార్టులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా సుమన్ నాయక్ కృషి చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బాలికలకు క్రీడా దుస్తులు అందించడంపై విద్యార్థినులు, కోచ్ సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు దారం సుశీల ట్రస్టు ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
