చికిత విజయం మా ఊరికే గర్వకారణం
అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై సత్తా చాటిన క్రీడాకారిణికి ఘన సన్మానం: సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య ఎలిగేడు, అక్టోబరు 8 (చైతన్యగళం): అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై సత్తా చాటి భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్‌కు వచ్చిన చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చికిత ప్రతిభ, కఠోర శ్రమ, పట్టుదలతో...