Wednesday, October 7, 2026
Homeతెలంగాణనిజాం చెరువును ‘బతుకమ్మ చెరువు’గా మార్చాలి

నిజాం చెరువును ‘బతుకమ్మ చెరువు’గా మార్చాలి

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

మహబూబాబాద్‌, అక్టోబరు 6 (చైతన్యగళం): మానుకోట పట్టణంలోని నిజాం చెరువు పేరును మార్చి ‘బతుకమ్మ చెరువు’గా నామకరణం చేయాలని బీజేపీ పట్టణ ఇన్‌చార్జి ఎల్ది మల్లయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిజాం పేరు కొనసాగించడం సరికాదన్నారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పేరును చెరువుకు పెట్టాలని కోరారు. నిజాం పాలనలో ప్రజలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రజాకార్లకు వ్యతిరేకంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిజాం చెరువు పేరును మార్చి ‘బతుకమ్మ చెరువు’గా నామకరణం చేయాలని కోరారు.

కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దార ఇందుభారతి, పట్టణ ఉపాధ్యక్షుడు రవియాదవ్‌, ప్రధాన కార్యదర్శులు రవినాయక్‌, నరేష్‌నాయక్‌, వార్డు ఇన్‌చార్జి చుక్కల నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!