నిజాం చెరువును ‘బతుకమ్మ చెరువు’గా మార్చాలి
మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు మహబూబాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): మానుకోట పట్టణంలోని నిజాం చెరువు పేరును మార్చి ‘బతుకమ్మ చెరువు’గా నామకరణం చేయాలని బీజేపీ పట్టణ ఇన్‌చార్జి ఎల్ది మల్లయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిజాం పేరు కొనసాగించడం సరికాదన్నారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పేరును చెరువుకు పెట్టాలని కోరారు. నిజాం పాలనలో ప్రజలు,...