Monday, October 5, 2026
Homeతెలంగాణకరీంనగర్సర్వే నంబర్‌ సవరించి నష్టపరిహారం అందించాలి

సర్వే నంబర్‌ సవరించి నష్టపరిహారం అందించాలి

📰 Generate e-Paper Clip

  • గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణలో సమస్య పరిష్కరించాలి
  • ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు రాయికల్‌ రైతుల వినతి

సైదాపూర్‌, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): సర్వే నంబర్‌ 120గా తప్పుగా నమోదైన తమ భూములను సర్వే చేసి, సర్వే నంబర్‌ 237గా సవరించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సైదాపూర్‌ మండలం రాయికల్‌ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాతలు, తండ్రుల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే తమ భూములకు సంబంధించిన సర్వే నంబర్‌ 120గా తప్పుగా నమోదైందని, వాస్తవంగా సర్వే నంబర్‌ 237గా సవరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో సైదాపూర్‌ మండల ప్రజావాణిలో శిక్షణ కలెక్టర్‌కు వినతిపత్రం అందించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా తమ భూములను కోల్పోతున్నప్పటికీ సర్వే నంబర్‌ తప్పుగా నమోదై ఉండటంతో నష్టపరిహారం అందడం లేదని తెలిపారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సర్వే నంబర్‌ను 237గా సవరించి, పట్టాదారు పాస్‌బుక్కులు అందజేయడంతో పాటు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదనపు కలెక్టర్‌ తమ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని రైతులు కోరారు.

వినతిపత్రం అందజేసిన వారిలో రాయికల్‌ గ్రామ రైతులు జేరిపోతుల రాజు, శనిగెరపు కొమరయ్య, గడిపే వినోద్‌, గడిపే రంజిత్‌, మారుపాక రాజు, పిట్టల ఆశాలు, గడిపే లింగమూర్తి, గడిపే ఎల్లమ్మ, దాడి ఎల్లయ్య, జేరిపోతుల నరసయ్య, మొలుగూరి రవి, మొలుగూరి వీరయ్య, గడిపే కొమరయ్య తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!