సర్వే నంబర్ సవరించి నష్టపరిహారం అందించాలి
గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణలో సమస్య పరిష్కరించాలి ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు రాయికల్ రైతుల వినతి సైదాపూర్, అక్టోబర్ 5 (చైతన్యగళం): సర్వే నంబర్ 120గా తప్పుగా నమోదైన తమ భూములను సర్వే చేసి, సర్వే నంబర్ 237గా సవరించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాతలు, తండ్రుల కాలం నుంచి...