Monday, October 5, 2026
Homeతెలంగాణకరీంనగర్న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

📰 Generate e-Paper Clip

  • న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ హుస్నాబాద్‌ కోర్టు ఎదుట నిరసన

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ హుస్నాబాద్‌ కోర్టు ఎదుట సోమవారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. చేర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో న్యాయవాదులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు.

దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, వేగవంతమైన న్యాయ ప్రక్రియ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లో ఉన్నప్పటికీ దాడులు కొనసాగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, సీనియర్‌ న్యాయవాదులకు భద్రత కల్పించేందుకు వ్యక్తిగత రక్షణ సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

నిరసనలో హుస్నాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు బాకం సంపత్‌, మాజీ అదనపు ప్రభుత్వ న్యాయవాది కన్నోజు రామకృష్ణ, సీనియర్‌ న్యాయవాదులు కొమ్ముల రమేష్‌, షార్ఫోద్దీన్‌, బోయిని సురేష్‌, కొంకట శ్రీనివాస్‌, దీకొండ ప్రవీణ్‌కుమార్‌, బానోత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, ప్రదీప్‌, ఉప్పరపల్లి సంపత్‌, జెరిపోతుల కిరణ్‌, అన్నబోయిన శ్రీశైలం, పార్నంది ప్రవీణ్‌, జాగత్పాల్‌, విశ్వతేజ, రాజ్యలక్ష్మి, సువర్ణప్రియ, విజ్జగిరి అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!