- తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడిగా గొర్రె థామస్ ఏకగ్రీవ ఎన్నిక
ఎల్కతుర్తి, అక్టోబర్ 25 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె థామస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్మకంటి దయాకర్ ప్రకటించి, థామస్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
గొర్రె థామస్ గతంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ సంఘం అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల ప్రచారానికి విశేష కృషి చేశారని వెల్మకంటి దయాకర్ పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు వెల్మకంటి దయాకర్‌తో పాటు తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ గొర్రె థామస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలైన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం సాధనకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గొర్రె థామస్ ఎన్నిక పట్ల ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన అంబేద్కర్‌వాదులు, ప్రజాసంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పారంద స్వామి, అధికార ప్రతినిధి ఇసంపెల్లి రమేష్, గౌరవ అధ్యక్షుడు జన్ను నర్సయ్య, ముఖ్య సలహాదారు ఇసంపెల్లి నీలయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు వివేకానంద, జంగిలి భాస్కర్, వల్లందాస్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
