వేములపల్లి, అక్టోబరు 5 (చైతన్యగళం): జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాలు, షీ టీం సీఐ మంజుల సూచనల మేరకు మిర్యాలగూడ షీ టీం ఆధ్వర్యంలో సోమవారం అమనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ మౌజీస్ హుస్సేన్, కానిస్టేబుళ్లు రాజేశ్వరి, మధు విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మంచి స్పర్శ–చెడు స్పర్శ, బాల్య వివాహాల నిర్మూలన, హెల్మెట్, సీటు బెల్టు ప్రాధాన్యంపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, షీ టీం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధానాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా మౌజీస్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా షీ టీంను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.యోగేశ్వర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
