న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ హుస్నాబాద్‌ కోర్టు ఎదుట నిరసన హుస్నాబాద్‌, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ హుస్నాబాద్‌ కోర్టు ఎదుట సోమవారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. చేర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో న్యాయవాదులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, వేగవంతమైన న్యాయ ప్రక్రియ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లో ఉన్నప్పటికీ...