కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం):
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జైలుకు 500 లీటర్ల చెస్ట్ ఫ్రీజర్‌ను శుక్రవారం విరాళంగా అందజేశారు. జైలు పరిధిలో ఆహార పదార్థాలను సురక్షితంగా, పరిశుభ్రంగా నిల్వ చేసేందుకు, అలాగే ఖైదీల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఈ చెస్ట్ ఫ్రీజర్‌ను అందించారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా జైలు ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, కమిషనర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎంహెచ్‌ఓ హాజరై లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు.
క్లబ్ అధ్యక్షుడు మయాదం శివకాంత్ పటేల్ మాట్లాడుతూ సమాజంలోని అవసరాలను గుర్తించి ప్రజలకు, వివిధ ప్రభుత్వ సంస్థలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిదుర సురేష్, పెద్ది విద్యాసాగర్, మేతుకు చైతన్య, బట్టు వినోద్, సింగమరాజు, రేగూరి రవీందర్, నాగమళ్ల వేణు మాధవ్, మేతుకు వంశీకృష్ణ, అలగండుల మునీందర్, ఐతా సూరజ్, కాదర్ల ప్రభాకర్, గారెపల్లి వేణుకుమార్ తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తమ సహకారాన్ని అందించారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేవ, మానవతా దృక్పథం, సమాజ సంక్షేమం పట్ల లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్‌కు ఉన్న నిబద్ధత మరోసారి చాటిచెప్పబడింది.
