జిల్లా జైలుకు 500 లీటర్ల చెస్ట్ ఫ్రీజర్ విరాళం

కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం): లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జైలుకు 500 లీటర్ల చెస్ట్ ఫ్రీజర్‌ను శుక్రవారం విరాళంగా అందజేశారు. జైలు పరిధిలో ఆహార పదార్థాలను సురక్షితంగా, పరిశుభ్రంగా నిల్వ చేసేందుకు, అలాగే ఖైదీల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఈ చెస్ట్ ఫ్రీజర్‌ను అందించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా జైలు ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, కమిషనర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎంహెచ్‌ఓ హాజరై...