- రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి: దండి లక్ష్మి
హుస్నాబాద్, అక్టోబరు 1 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అక్టోబరు 2 నుంచి నిర్వహించనున్న 52వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సిద్దిపేట జిల్లా జూనియర్ బాలుర జట్టుకు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సెప్టెంబరు 16 నుంచి నిర్వహించిన శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది.
ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరమణ, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్న రాజు, సీనియర్ న్యాయవాది చిత్తారి రవీందర్, మహ్మదాపూర్ ఉపసర్పంచ్ కత్తుల సమ్మరాజు, పీడీ ఆర్. శ్రీనివాస్, శిక్షణ శిబిరం కోచ్ కృష్ణ, సీనియర్ క్రీడాకారులు షేక్ బాబా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ శిబిరంలో క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
దండి లక్ష్మి మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో నేర్చుకున్న నైపుణ్యాలను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించాలని కోరారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించిన కోచ్ కృష్ణను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
