Saturday, October 3, 2026
Homeతెలంగాణనల్గొండఎల్లా పిచ్చిరెడ్డి నెలమాసిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి

ఎల్లా పిచ్చిరెడ్డి నెలమాసిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి

📰 Generate e-Paper Clip

  • చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి

మాడుగులపల్లి, అక్టోబరు 1 (చైతన్యగళం): నాగార్జునసాగర్‌ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గారకుంటపాలెం గ్రామానికి చెందిన, నిడమనూరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎల్లా పిచ్చిరెడ్డి నెలమాసిక కార్యక్రమంలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎల్లా పిచ్చిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పిచ్చిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ కృపాకర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాబాయ్‌సెట్‌, కుక్కడం సర్పంచ్‌ నకిరేకంటి ప్రసన్న రాబర్ట్‌, తోపుచర్ల సర్పంచ్‌ నన్నెబోయిన పార్వతమ్మ రమేష్‌, గోపాలపురం సర్పంచ్‌ వీరబోయిన నాగరాజు, ధర్మపురం మాజీ సర్పంచ్‌ యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నరేందర్‌, ఉద్యమకారుడు పగిల్ల సైదులు, ఉప్పుల సుదర్శన్‌రెడ్డి, అనంతరెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!