సిద్దిపేట జిల్లా కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి: దండి లక్ష్మి హుస్నాబాద్, అక్టోబరు 1 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అక్టోబరు 2 నుంచి నిర్వహించనున్న 52వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సిద్దిపేట జిల్లా జూనియర్ బాలుర జట్టుకు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సెప్టెంబరు 16 నుంచి నిర్వహించిన శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్...