వరంగల్ సీపీ శ్వేతను కలిసిన రెడ్‌క్రాస్ నూతన పాలకవర్గం
సేవా కార్యక్రమాలపై చర్చ.. సీపీకి ఘన సన్మానం వరంగల్ ప్రతినిధి, అక్టోబరు 1 (చైతన్యగళం): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా నూతన చైర్మన్ బేతి అశోక్‌బాబు ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై సీపీతో చర్చించారు. అనంతరం శ్వేతను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శనబోయిన రాజ్‌కుమార్, కోశాధికారి బోల్లం శివ,...