Thursday, October 1, 2026
Homeతెలంగాణకరీంనగర్ఘనంగా సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

  • హుస్నాబాద్‌లో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

హుస్నాబాద్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): బీఆర్‌ఎస్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలను బుధవారం పార్టీ నాయకులు నిర్వహించారు. హుస్నాబాద్‌లోని మల్లెచెట్టు చౌరస్తాలో కేక్‌ కట్‌ చేసి సతీష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ సతీష్‌కుమార్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన హయాంలో సుమారు రూ.10 వేల కోట్ల నిధులు నియోజకవర్గానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయన నాయకత్వంలో హుస్నాబాద్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు.

2029 శాసనసభ ఎన్నికల్లో సతీష్‌కుమార్‌కు ప్రజల మద్దతు లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బొజు రవీందర్‌, సూరంపల్లి పరశురాములు, చిత్తారి శ్రీనివాస్‌, ఇంద్రాల సారయ్య, యాస శ్రీనివాస్‌, గండిపల్లి సంపత్‌, మేకల వికాస్‌ యాదవ్‌, మల్లంపల్లి శ్యాంసుందర్‌, బానోత్‌ సంతోష్‌ నాయక్‌, శివ, కేసిరెడ్డి రాంచంద్రారెడ్డి, మాటూరి రాజశేఖర్‌గౌడ్‌, మహమ్మద్‌ సుకూర్‌, అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!