భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలి – ఏఐవైఎఫ్‌ నాయకుల పిలుపు

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): షహీద్‌ భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఏఐవైఎఫ్‌ మండల అధ్యక్షుడు దొంతరబోయిన రజిత, కార్యదర్శి జాగీర్‌ సాయి పిలుపునిచ్చారు. సోమవారం అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో భగత్‌సింగ్‌ జయంతి నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భగత్‌సింగ్‌ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా గొప్ప ఆలోచనాపరుడిగా, సామాజిక అసమానతలను ప్రశ్నించిన విప్లవకారుడిగా యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. యువత విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై చైతన్యంతో స్పందించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో...