- తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు: సాదుల పవన్‌కుమార్
నంగునూరు, సెప్టెంబరు 27 (చైతన్యగళం): నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పద్మశాలి సమాజ ప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతానికి బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్‌కుమార్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశ సేవ చేసిన ఆయన.. అనంతరం తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో దాసరి రామలింగం, సాదుల చంద్రశేఖర్, దాసరి రవి, కారపురి శ్రీనివాస్, బింగి రవీందర్, బొజ్జ మహేష్, ఆనందాస్ విష్ణుమూర్తి, దాసరి మల్లేశం, కారంపూరి రామచంద్రం, ఆరగొండ శశి, పోతన వినోద్, దికొండ భాను, దాసరి వినయ్, దాసరి శేఖర్, వేముల ప్రశాంత్, గాజర్ల సిద్దు, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
