Sunday, September 27, 2026
Homeతెలంగాణకరీంనగర్సీఎం రాకకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సీఎం రాకకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 26 (చైతన్య గళం):

ఈ నెల 30న కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ అధికారులతో పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకుని అమలు చేయాలని ఆదేశించారు. వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పూర్తిచేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, మైక్ సిస్టమ్, ప్రెస్ గ్యాలరీ తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలోనే ఒక మోడల్‌గా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, రాకపోకలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు సమీక్షించారు. అలంకరణ, విద్యుత్, మైక్ సిస్టమ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను ముందుగానే పరిశీలించాలని సూచించారు. కార్యక్రమాన్ని కవర్ చేసే మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ప్రతి నోడల్ అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, పోలీస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!