Sunday, September 27, 2026
Homeతెలంగాణకరీంనగర్జమ్మికుంటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

జమ్మికుంటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

జమ్మికుంట, సెప్టెంబర్ 26 (చైతన్య గళం):

బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జమ్మికుంటలో తెలంగాణ విప్లవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, విస్నూర్ జమీందార్ రాంచంద్రారెడ్డి, విస్నూర్ దేశ్‌ముఖ్ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.‘‘నా భూమిపై నీ హక్కేంది?’’ అంటూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె జయంతి సందర్భంగా శతకోటి ప్రణామాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టంగుటూరి రాజ్‌కుమార్, కైలాస కొట్టి గణేష్, రాచపల్లి ప్రశాంత్, గుర్రం పరుశురాములు, తూర్పాటి శంకర్, ఆకుల పోచయ్య, తిరుపతి, ఆడవాళ్ల శ్రీధర్, అఖిల్, పసునూటి మల్లికార్జున్, తాటికంటి మల్లేష్, పనికిరా రమేష్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!