Sunday, September 27, 2026
Homeతెలంగాణకరీంనగర్చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం - కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం – కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 26 (చైతన్య గళం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం భూస్వామ్య శక్తులకు ఎదురొడ్డి నిలిచిన అసమాన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని, ఆమె ఆశయాలను, పోరాట స్ఫూర్తిని సమాజంలో ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్ఐ కిరణ్ కుమార్, కమిషనరేట్ పరిపాలనా విభాగం అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!