జమ్మికుంటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

జమ్మికుంట, సెప్టెంబర్ 26 (చైతన్య గళం): బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జమ్మికుంటలో తెలంగాణ విప్లవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, విస్నూర్ జమీందార్ రాంచంద్రారెడ్డి, విస్నూర్ దేశ్‌ముఖ్ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.‘‘నా భూమిపై నీ హక్కేంది?’’ అంటూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా...