Friday, September 25, 2026
Homeతెలంగాణజీవో 25ను సవరించాలని ఎస్‌జీటీ ఉపాధ్యాయుల నిరసన

జీవో 25ను సవరించాలని ఎస్‌జీటీ ఉపాధ్యాయుల నిరసన

📰 Generate e-Paper Clip

  • ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్‌

కోహెడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): ప్రాథమిక పాఠశాలల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పెంచే చర్యలను విరమించుకోవాలని, జీవో 25ను రద్దు లేదా సవరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కోహెడ జెడ్పీహెచ్‌ఎస్‌ కాంప్లెక్స్‌లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం పేరుతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులపై అదనపు పనిభారం మోపడం సరికాదని వారు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా సిల్వకోడూరు పాఠశాల ఉపాధ్యాయుడు ప్రశాంత్‌ కాంప్లెక్స్‌ సమావేశం సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.

‘ప్రాథమిక ఉపాధ్యాయులను కాపాడండి.. ప్రాథమిక పాఠశాలలను కాపాడండి’ అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం స్పందించి జీవో 25ను రద్దు లేదా సవరించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!