Saturday, September 26, 2026
Homeతెలంగాణహుస్నాబాద్ బస్టాండ్‌లో ఊడిపడిన సీలింగ్

హుస్నాబాద్ బస్టాండ్‌లో ఊడిపడిన సీలింగ్

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, సెప్టెంబర్ 25 (చైతన్యగళం): హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం తప్పింది. బస్టాండ్‌లోని సిద్దిపేట, సికింద్రాబాద్ 7వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద గురువారం సాయంత్రం పైకప్పు ఒక్కసారిగా ఊడిపడి కిందపడింది. ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైకప్పు కిందపడిన సమయంలో ప్రయాణికులు ఎవరైనా అక్కడ ఉంటే బలమైన గాయాలు అయ్యే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు తడిసి ఊడిపోయి కిందపడినట్లు కనిపిస్తోంది. బస్టాండ్‌లో మరికొన్ని చోట్ల కూడా పైకప్పు ఊడిపడే స్థితిలో ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరగకముందే బస్టాండ్‌లోని పైకప్పులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రమాదం జరగకముందే బస్టాండ్‌లో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!