జీవో 25ను సవరించాలని ఎస్‌జీటీ ఉపాధ్యాయుల నిరసన
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ కోహెడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): ప్రాథమిక పాఠశాలల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పెంచే చర్యలను విరమించుకోవాలని, జీవో 25ను రద్దు లేదా సవరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ కోహెడ జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్‌లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం పేరుతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులపై అదనపు పనిభారం మోపడం సరికాదని వారు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా సిల్వకోడూరు పాఠశాల ఉపాధ్యాయుడు...